జూన్ 5, 2025న, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని, 2వ ASEZ WAO గ్లోబల్ ఫోరమ్ రిపబ్లిక్ ఆఫ్ కొరియాలోని జేజులో నిర్వహించబడెను.
ASEZ WAO, దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ యొక్క యవ్వన ఉద్యోగులు స్వచ్ఛంద బృందము, వివిధ రంగాలకు చెందిన నిపుణులు మరియు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులతో “ప్లాస్టిక్-ఫ్రీ 2040” అనే అంశంతో భవిష్యత్తు కోసం కార్యాచరణ పరిష్కారాలను చర్చించారు.
ప్రముఖ వక్తలు—సియోల్ నేషనల్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎన్విరాన్ మెంటల్ స్టడీస్ ప్రొఫెసర్ కిమ్ ఇన్-హ్వాన్ మరియు ఫిలిప్పీన్స్ లోని UP-CIFAL డైరెక్టర్ మరియు ఫిలిప్పీన్స్ యూనివర్సిటీ ఫ్యాకల్టీ సభ్యుడు మిచెల్లీ పలుంబరిట్ తో సహా—యౌవన యొక్క పాత్రపై మరియు ప్రపంచ వాతావరణాన్ని పునరుద్ధరించడానికి వ్యూహాలపై అంతర్దృష్టులను పంచుకున్నారు.
ఈ కార్యక్రమం భూమిపై అర్థవంతమైన మార్పును తీసుకురావడంలో ఖచ్చితమైన చర్య మరియు సంఘీభావం యొక్క శక్తిని ప్రదర్శిస్తూ, ప్రపంచవ్యాప్తంగా ASEZ WAO యౌవనులు సంయుక్తంగా చేపట్టిన 40-రోజుల “ప్లాస్టిక్ కాలుష్యం-రహిత” ప్రచారం యొక్క ముగింపుగా గుర్తించబడెను.
ASEZ WAO “యౌవనులు క్రియ తీసుకున్నప్పుడు, ప్రపంచం మారుతుంది” అనే నమ్మకంతో స్థిరమైన భవిష్యత్తు దిశగా ముందుకు సాగడం కొనసాగిస్తుంది.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం