ఈ ప్రపంచంలో మనం ఎక్కడ జన్మించినా, మనం పెరిగేకొద్దీ మన పరిసరాలు మరియు మన సంప్రదాయాలన్నీ మనలో పాతుకుపోతాయి. అనేక మార్లు, ప్రజలు “మనమెందుకు ఇలా చేస్తాము?” అని అడిగినప్పుడు సమాధానం తరచుగా, “నాకు తెలియదు. నేనెప్పుడూ అలా చేసియుండెను” అని ఇవ్వబడుతుంది. ఈవిధంగా, చిన్ననాటి నుండి ప్రజలు పట్టుకున్న సంప్రదాయలు పెద్దలుగా వారిలో నిలిచిపోవటం కొనసాగును. కాని వారు తమ ఆత్మీక గుర్తింపును నిర్వచించే వారి విశ్వాసం వలె సున్నితమైన మరియు ముఖ్యమైన విషయం సంగతేమిటి?
మూలాన్ని పరిగణనలోకి తీసుకోకుండా మన ముందు వచ్చేవారి సంప్రదాయాన్ని మన ఆత్మీక నిర్మాణాన్ని, ఆరోగ్యాన్ని, మరియు విధిని నిర్దేశించాలా?
మనం చుట్టూ చూసినప్పుడు, క్రైస్తవమతం మరియు దాని సిద్ధాంతాలు పరిశుద్ధగ్రంథపు బోధనలకు చాలా దూరంగా ఉన్న బోధనలు మరియు సంప్రదాయాలు. దురదృష్టవశాత్తు, ఈ మార్పు దాదాపు రెండవ శతాబ్దము నుండి నాల్గవ శతాబ్దపు మధ్యకాలము వరకు జరగటం ప్రారంభమైనది, అప్పుడు పాపసీ అన్ని సంఘాలపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించి, యేసు యొక్క నామంలో రోమా సూర్య-దేవుని సంప్రదాయాలను పాటించేలా క్రైస్తవ మతాన్ని పునర్నిర్మించారు. మనం చరిత్రలోకి చూసినప్పుడు, ఆదివారపు ఆరాధన అనునది నిజానికి క్రీ.శ. 321లో రోమాలో “SUN”న్ను ఆరాధించుటకు ప్రకటించబడిన ఒక నియమమై యుండెను. అలాగే, పారసీక సూర్య దేవుడైన మిత్రా యొక్క పుట్టుక నుండి ఉద్భవించిన డిసెంబరు 25 అనునది, యేసు అప్పటికే ఆరోహణమైన 300 సంవత్సరాల తర్వాత క్రీ.శ. 354 నుండి క్రైస్తవమతం చేత స్వీకరించబడెను.
అయితే, లోకమంతా సంప్రదాయాలు మరియు మానవ-నిర్మిత ఆచారాల ద్వారా దేవుడిని వ్యర్థంగా ఆరాధిస్తున్నట్లైతే, దేవుడు ఎవరికి రక్షణనిచ్చును?
ఇందు కారణంగా పరిశుద్ధగ్రంథం యొక్క ప్రవచనములన్నిటి ప్రకారం రెండవ రాకడ క్రీస్తు ముందే వచ్చియున్నారని గ్రహించటం చాలా ముఖ్యమైనది.
మరియు ఆయన మన సమయంలో దేవుని బోధనలను పునరుద్ధరించారు.
మీకా గ్రంథము లో ఇలా సెలవిస్తుంది, “అంత్యదినములలో యెహోవామందిరపర్వతము పర్వతముల శిఖరమున స్థిరపరచబడి కొండలకంటె ఎత్తుగా ఎత్తబడగా ప్రవాహము వచ్చినట్లు జనులు దానిలోనికి వత్తురు. . . . అన్యజనులనేకులు వచ్చి . . . ఆయన తనమార్గములవిషయమై మనకు బోధించును. . .”
అంత్య దినాలలో సకల జనులు సీయోనుకు వచ్చి దేవుని చేత బోధింపబడుదురని చెప్పబడెను. అయితే, ఈ లోకంలోని సంఘాలన్నిటిలోకెల్లా, రెండవ రాకడ క్రీస్తు చేత బోధించబడి, విశ్రాంతి దినము, పస్కా, మరియు ముసుగు కట్టడ వంటి దేవుని ఆజ్ఞలన్నిటినీ గైకొనే ఏకైక సంఘము ఏది? మనలను స్వతంత్రులనుగా చేయు క్రీస్తు బోధనలను బోధించే మరియు ఆచరించే ఏకైక సంఘం దేవుని సంఘము ప్రపంచ పరిచర్య సంస్ధ. దయచేసి మానవ సంప్రదాయాన్ని వదిలివేయండి మరియు దేవుని ఆజ్ఞలను పట్టుకొని నిజమైన విశ్వాసంతో ఆత్మల యొక్క రక్షణను పొందుకోండి.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం