ఈ భూమిపై జన్మించిన ప్రతి వ్యక్తి, సొలొమోను మరియు యోబు వలె, ఒకప్పుడు పరలోక రాజ్యంలో జీవించిన దేవదూత. ఒకప్పుడు పరలోకమందు దేవునితో మహిమలో జీవించిన దూతలు మరణానికి నడిపించే గొప్ప పాపం చేసి త్రోసివేయబడిన స్థలమే ఈ భూమి కాబట్టి, ఇక్కడి జీవితం శ్రమతో మరియు దుఃఖంతో నిండియున్నదని మనకు బోధించబడెను.
ఈరోజు, నశించిన క్రొత్త నిబంధన పస్కాను పునరుద్ధరించినవారు మరెవరో కాదు, మన దేవుడే. ఎందుకనగా, మానవాళి పరలోకంలో చేసిన పాపాలు—మరణానికి నడిపించే ఆ పాపాలు—క్షమించబడి, వారు పరలోక రాజ్యానికి తిరిగి చేరుకొనేలా, యేసు సిలువపై తన బలిదానము ద్వారా స్థాపించిన నిబంధనయే క్రొత్త నిబంధన పస్కా.
దేవుని కృపామహదైశ్వర్యమునుబట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తమువలన మనకు విమో చనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది. ఎఫెసీయులు 1:7
ఏలయనగా పాపమువలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన క్రీస్తుయేసునందు నిత్యజీవము. రోమీయులకు 6:23
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం