2,000 సంవత్సరాల క్రితం, సృష్టికర్తయైన దేవుడు యేసు అనే నామంలో
ఈ భూమిపైకి వచ్చి క్రొత్త నిబంధనను స్థాపించారు.
పాపం మరియు మరణంలో బాధపడుతున్న దేవుని పిల్లలు,
క్రొత్త నిబంధన ద్వారా, పాప క్షమాపణ మరియు నిత్యజీవమును పొందగలరు.
మూడు సంవత్సరాలుగా, క్రొత్త నిబంధనను ఆచరించే మాదిరిని తన శిష్యులకు చూపించారు.
“నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలెనని మీకు మాదిరిగా ఈలాగు చేసితిని.”యోహా 13:15
పునరుత్థానం తరువాత, యేసు క్రీస్తు తన శిష్యులను సకల జనులకు క్రొత్త నిబంధనను గైకొనేలా
ప్రకటించుమని సెలవిచ్చారు, తద్వారా వారు రక్షింపబడగలిగెను. (మత్త 28:19)
యేసు క్రీస్తు యొక్క వాక్యములను వెంబడిస్తూ, శిష్యులు క్రొత్త నిబంధనను ప్రకటించారు.
మనము పాపక్షమాపణ పొందగలిగే క్రొత్త నిబంధనలో, ఆరాధన యొక్క నియమము కలదు.
ఆరాధన సమయంలో పురుషులు తల మీద ముసుగును ధరిస్తే, అది దేవునికి అవమానం;
స్త్రీలు తలమీద ముసుకు వేసికొనకపోతే, అది ఆమె తలకు అవమానం (1 కొరిం 11:4)
క్రొత్త నిబంధనను అనుసరించే సంఘములో, స్త్రీలు ఆరాధన సమయంలో తలమీద ముసుకును వేసుకొనును
మరియు పురుషులు వేసికొనరు.
ఏమైనా, యేసు క్రీస్తు యొక్క ఆరోహణం తర్వాత,
కొంతమంది స్త్రీలు తాము ముసుకును ధరించాల్సిన అవసరం లేదని వాదించుదురు.
దీని కారణంగా, అపొస్తలుడైన పౌలు, మానవ స్వభావంతో స్త్రీకి పొడవాటి జుట్టు
అందంగా కనిపిస్తుందని వివరిస్తూ, ముసుకును ధరించుమని వారిని ప్రోత్సహించెను.
మీలో మీరే యోచించుకొనుడి; స్త్రీ ముసుకులేనిదై దేవుని ప్రార్థించుట తగునా?
పురుషుడు తల వెండ్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావసిద్ధముగా మీకు తోచును గదా?
స్త్రీకి తల వెండ్రుకలు పైటచెంగుగా ఇయ్యబడెను గనుక ఆమె తలవెండ్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము.
ఎవడైనను కలహప్రియుడుగా కనబడినయెడల మాలోనైనను దేవుని సంఘములోనైనను ఇట్టి ఆచారములేదని వాడు తెలిసికొనవలెను.1 కొరింథీయులకు 11:13-16
ఆరాధన సమయంలో స్త్రీలు ముసుకును ధరించవలెనని పరిశుద్ధ గ్రంథము స్పష్టంగా సెలవిస్తుంది.
ఆరాధన సమయంలో స్త్రీలు ముసుకును ధరించడం అనేది యేసు క్రీస్తు బోధించిన మరియు
అపొస్తలుడైన పౌలు బోధించిన క్రొత్త నిబంధన యొక్క నియమములో ఒకటి.
ముసుకు యొక్క నియమమును అనుసరించడం దేవుని యొక్క చిత్తం.
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం