దేవుడు ప్రజల హృదయాలను మరియు మనస్సులను చూచును కనుక, ఆయనకు ఏదియూ దాచబడదు.
ఒక వ్యక్తి జీవితంలో చేసే ప్రతి పని దేవుని తీర్పు సింహాసనం ముందు బయటపడుతుంది, మరియు ప్రతి ఒక్కరూ తమ క్రియలను బట్టి తీర్పు పొందబోతున్నారు. అందుకే పరిశుద్ధ గ్రంథం ఇలా చెబుతోంది: “మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.”
“మీరు అల్పమైనవానిలో ఒకదానికొరకు చేసికొనినది నాకు చేసితిరి” అని సెలవిచ్చిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుడు బోధనల ప్రకారం, దేవుని సంఘ సభ్యులు వినయంగా ఒకరికొకరు సేవ చేసుకుంటారు మరియు ప్రేమను అభ్యసిస్తారు.
అంతేగాకుండా, ఇశ్రాయేలీయుల సణుగుడు మరియు ఫిర్యాదుల వల్ల కలిగిన నాశనమును మరియు యాజకుని కుమారులైన హోఫ్నీ మరియు ఫీనెహాసు యొక్క అవినీతిని పాఠంగా తీసుకొని, వారు ఎల్లప్పుడూ విశ్వాసపు పరిశుద్ధ జీవితం జీవించుటకు ప్రయాసపడుతారు.
మిమ్మును పిలిచినవాడు పరిశుద్ధుడైయున్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
పక్షపాతములేకుండ క్రియలనుబట్టి ప్రతివానిని తీర్పుతీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థనచేయుచున్నారు గనుక మీరు పరదేశులై యున్నంతకాలము భయముతో గడుపుడి.
ఇదంతయు వినిన తరువాత తేలిన ఫలితార్థమిదే; దేవునియందు భయభక్తులు కలిగియుండి ఆయన కట్టడల ననుసరించి నడుచుచుండవలెను, మానవకోటికి ఇదియే విధి. గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును. 1 పేతురు 1:16–17
ప్రసంగి 12:13–14
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం