మనం క్రొత్తనిబంధన పస్కా ద్వారా దేవుని వైపు తిరిగిన యెడల,
మనం పాపక్షమాణను మరియు నిత్య జీవమును పొందుకుంటాము.
ఏమైనా, ఎవరైనను దేవుని నిబంధనలో నిలిచియుండని యెడల,
దేవుడు వారిని వదిలిపెట్టును; అంతిమంగా, రాజైన సౌలు మరియు
యూదా ఇస్కరియోతులో దురాత్మలు ప్రవేశించి వారికి జరిగినట్లుగానే
వారు ఒక దారుణమైన అంతమును ఎదుర్కొనెదరు.
రాజైన హిజ్కియా “పస్కాను గైకొని దేవుని వైపు తిరుగుడి” అని చాటించుటకు
అంచెవాండ్రను పంపినపుడు, ఉత్తర ఇశ్రాయేలు ప్రజలు వారిని హేళన చేసి ఎగతాళి చేశారు.
చివరకు, ఈ ప్రజలు నాశనమయ్యారు. అదే తరహాలో స్పందించే ఈనాటి ప్రజలు
ఉత్తర ఇశ్రాయేలు ప్రజల వలెనే అదే అంతమును ఎదుర్కొనెదరు. లోకంలో అనేక సంఘాలు
ఉన్నప్పటికినీ, దేవుని యొక్క వాగ్ధానమైన పస్కాను ఆచరించే సంఘము మాత్రమే,
దేవుని వైపు తిరిగారని మరియు దేవుడు వారితో ఉండే సంఘముగా
దీవించబడినవారని చెప్పవచ్చు.
“హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు పస్కాపండుగ ఆచరించుటకై యెరూషలేములోనున్న యెహోవా మందిరమునకు రావలసినదని ఇశ్రాయేలువారికందరికిని యూదావారికందరికిని వర్తమానములను, ఎఫ్రాయిమీయులకును మనష్షేవారికిని పత్రికలను పంపెను . . . అబ్రాహాము ఇస్సాకు ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా వైపు తిరుగుడి.” 2 దినవృత్తాంతములు 30:1–6
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం