మనం మంచిని విత్తినట్లైతే, మనం ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందెదము,
మరియు మనం చెడును విత్తినట్లైతే, మనం చెడు ఫలితాలను పొందెదము.
అరణ్యంలో నలభై సంవత్సరాలుగా సణిగిన ఇశ్రాయేలీయులు, నాశనమైన చరిత్రను
మనం గుర్తుంచుకోవలెను, మరియు యౌవనస్ధుడైన దావీదు, షద్రకు, మేషాకు, మరియు
అబీద్నెగో కృపతో నిండిన తమ విశ్వాసపు మాటల ద్వారా సంతోషాన్ని అర్పించటం ద్వారా
దేవుని చేత గొప్పగా దీవించబడిన చరిత్రను మనం గుర్తించుకోవలెను.
క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క బోధనలకు అనుగుణంగా,
దేవుని సంఘ సభ్యులు ఎల్లప్పుడూ ఇంటి వద్ద, సంఘంలో మరియు సమాజంలో మంచి క్రియలు
మరియు సద్గుణమైన మాటల ద్వారా ఓదార్పును మరియు మద్దతును అందిస్తారు.
ఈరోజు, వారు “మరణమైనను దుఃఖమైనను వేదనైనను ఇక లేని పరలోక రాజ్యము ఉన్నది” అని
ప్రకటిస్తూ, భారమైన జీవితం వల్ల అలసిపోయిన వారితో దేవుని రక్షణ యొక్క
సంతోషకరమైన వార్తలను పంచుకొనుటకు బలంగా ముందుకు సాగారు.
సజ్జనుడు తన మంచి ధననిధిలోనుండి సద్విషయములను తెచ్చును;
దుర్జనుడు తన చెడ్డ ధననిధిలోనుండి దుర్విషయములను తెచ్చును.
నేను మీతో చెప్పునదేమనగా –మనుష్యులు పలుకు వ్యర్థమైన
ప్రతి మాటను గూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.
నీ మాటలనుబట్టి నీతిమంతుడవని తీర్పునొందుదువు,
నీ మాటలనుబట్టియే అపరాధివని తీర్పునొందుదువు.
మత్తయి 12:35-37
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం