ఏదేను తోట యొక్క నియమం, పాత నిబంధన నియమం మరియు యేసు చేత స్థాపించబడిన క్రొత్త నిబంధన
నియమం ఇవన్నీ భవిష్యత్తులో మానవాళికి అద్భుతమైన మహిమను మరియు సంతోషాన్ని ఇచ్చుటకు
ఎలోహిమ్ దేవుని చేత ఏర్పాటు చేయబడ్డాయి.
ఈనాడు, దేవుని ఆజ్ఞలు మరియు నియమాల నుండి వైదొలగటం అక్రమము, దుష్టత్వము,
మరియు తిరుగుబాటుగా పరిగణించబడుతుందని దానియేలు ప్రవక్తతో సహా
అనేక ప్రవక్తల ద్వారా దేవుడు మనకు బోధిస్తున్నారు.
దేవుని యొక్క చిన్న బోధనను కూడా విస్మరించకుండా పరిశుద్ధగ్రంథం ప్రకారం నడుచుకోవాలని
వారికి సూచించిన క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారు మరియు తల్లియైన దేవుని యొక్క బోధనలను
దేవుని సంఘ సభ్యులు తమ హృదయాలలో లిఖించుకుంటారు.
యేసు క్రొత్త నిబంధన ధర్మశాస్త్రమును స్థాపించి, దానిని గైకొనే విషయంలో కూడా
ఒక మాదిరి చూపించినందున, వారు విశ్రాంతి దినము మరియు పస్కాతో సహా
మూడు మార్ల ఏడు పండుగలను ఆచరిస్తారు.
ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాటలాడుచు . . . అతడు పండుగ కాలములను
న్యాయపద్ధతులను నివారణచేయ బూనుకొనును; . . .
అతని యధికారము నశింపజేయుటకును నిర్మూలముచేయుటకును తీర్పు విధింపబడెను గనుక
అది కొట్టి వేయబడును.
ఆకాశమంతటి క్రిందనున్న రాజ్యమును అధికారమును రాజ్య మహాత్మ్యమును
మహోన్నతుని పరిశుద్ధులకు చెందును. ఆయన రాజ్యము నిత్యము నిలుచును, . . .
దానియేలు 7:25-27
నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా వ్రాయించి
నియమించినను వాటిని అతడు అన్యములుగా ఎంచెను.
హోషెయా 8:12
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం