మనం క్రొత్త నిబంధన సువార్తను విశ్వసించి, దేవుని ధర్మశాస్త్రమును సరిగ్గా గ్రహించి, దానిని గైకొన్నట్లైతే,
మనం నిత్య జీవమును పొందుకొని, రాజరిక యాజకులుగా మారగలము, మరియు దేవుని రాజ్యమును
స్వతంత్రించుకోగలము. అంతేగాకుండా, దేవుని యొక్క ధర్మశాస్త్రము మనలను నిత్య రక్షణ వద్దకు నడిపిస్తూ,
మనలను క్రీస్తు అన్ సాంగ్ హోంగ్ గారి వద్దకు మరియు నూతన యెరూషలేము పరలోక తల్లి వద్దకు నడిపించును.
“మనం దేవుని ధర్మశాస్త్రమును గైకొనవలసిన అవసరము లేదు” అనే విశ్వాసము అంతిమంగా
ఈ భూమిపై అనేక వినాశనములకు దారితీసిందని యెషయాతో సహా ప్రవక్తలు మనకు చెప్పారు.
నిర్దేశించినట్లుగా దేవుని ధర్మశాస్త్రమును గైకొనువారు సంతోషమును, ఆనందమును, మరియు
సమాధానమును అనుభవిస్తారు, అయితే దేవుని నియమాన్ని నిరాకరించువారు
తమ ఆలోచనలకు ఫలితముగా వినాశనములను మరియు శాపములను ఎదుర్కొంటారు.
అయితే మేము వినమని వారనుచున్నారు; అన్యజనులారా, వినుడి; సంఘమా,
వారికి జరిగిన దానిని తెలిసికొనుము.
భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు
గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.
యిర్మీయా 6:18-19
ప్రభువైన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతోకూడ పరలోకమునుండి అగ్నిజ్వాలలలో ప్రత్యక్షమై,
దేవుని నెరుగనివారికిని, మన ప్రభువైన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతి దండన చేయునప్పుడు
మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమపొందుచున్న మీకు మాతోకూడ విశ్రాంతియు
అనుగ్రహించుట దేవునికి న్యాయమే.
2 థెస్సలొనీకయులు 1:7-8
119 బుందాంగ్ పొస్ట్ బాక్స్, బుందాంగ్, సెంగ్నామ్-సి, గ్యొంగి-దొ, రిప. ఆఫ్ కొరియా
టెలీ 031-738-5999 ఫాక్స్ 031-738-5998
ప్రధాన కార్యలయము: 50, సునెరో, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
ప్రధాన సంఘం: 35, పాంగ్యొయోక్-రొ, బుందాంగ్, సెంగ్నాంమ్- సి, గ్యొంగి, రిప. ఆఫ్ కొరియా
© వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్, అన్ని హక్కులూ ప్రత్యేకించుకోవడమైనది. ప్రైవసీ విధానం